Sunday, November 24, 2024

పురుషులకు ఇక కండోమ్స్‌తో పనిలేదు.. వాటి స్థానంలో గర్భనిరోధక మాత్రలు

సాధారణంగా పిల్లలు వద్దనుకునే దంపతులలో మహిళలకు గర్భం రాకుండా ఉండేందుకు పురుషులు కండోమ్స్ వాడుతుంటారు. కొన్నిసార్లు మహిళలు కూడా గర్భనిరోధక మాత్రలు వేసుకుంటారు. వీటిని వాడటం వల్ల ఆడవారిలో అండాల తయారీ ఆగిపోతుంది. అయితే ఒక్కోసారి పురుషుల నుంచి వీర్యం ఎక్కువగా విడుదలైతే వారు కండోమ్స్ వాడినా ప్రయోజనం ఉండదు. దీంతో మహిళల తరహాలో పురుషులకు కూడా గర్భనిరోధక మాత్రలను పరిశోధకులు తయారుచేస్తారట. ఈ మాత్రలు వాడితే మగవారిలో వీర్యకణాలు ఉత్పత్తి కాకుండా ఉంటాయట.

మగవారికి కూగా గర్భనిరోధక మాత్రలు కనిపెడుతున్నట్లు స్కాట్లాండ్‌లోని దుండీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నిజానికి కుటుంబ నియంత్రణ పాటించేందుకు పురుషుల కోసం కండోమ్స్ కాకుండా ఇప్పటివరకు ఏదీ అందుబాటులోకి రాలేదు. అందువల్ల కొన్నిసార్లు కండోమ్ వాడినా ఫలితం ఉండటంలేదని, దీంతో ఒక్కోసారి మహిళలతో శారీరకంగా కలవాలంటే భయం వేస్తుందని మగవారు చెప్తుంటారు. అందువల్ల శారీరక సుఖం కోసం కలయికను కోరుకునే జంటలకు ఈ టాబ్లెట్లను అందుబాటులోకి తెస్తామని యూనివర్సిటీ ఆఫ్ దుండీ తెలిపింది. ఈ ప్రయోగాన్ని ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ దగ్గరుండి చేయిస్తున్నారట. ఇందుకోసం తన ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయాన్ని ఆయన అందిస్తున్నారట. రెండేళ్లలో పురుషుల కోసం గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: గద్వాల జిల్లాలో సూదిని మింగేసిన యువకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement