Saturday, November 23, 2024

అనారోగ్యంతో క‌న్నుమూసిన మ‌ల‌యాళ న‌టి

కాలేయ అనారోగ్యం బారిన ప‌డింది మ‌ల‌యాళ న‌టి సుభి సురేష్.కాగా కాలేయ మార్పిడి చికిత్స చేసేలోపే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. పాప్యులర్ టీవీ షోలకు యాంకర్ గా, కమెడియన్ గా మంచి పేరుని సంపాదించుకుంది.
ఆమె వ‌య‌సు 42.అనారోగ్యం కారణంగా మృతి చెందారు.సుభికి తండ్రి సురేష్, తల్లి అంబిక, సోదరుడు అభీ సురేష్ ఉన్నారు. కాలేయ వ్యాధితో ఆమె కొన్ని రోజులుగా కోచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. వాస్తవానికి ఆమెకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. కానీ, ఈ లోపే విషాదం చోటు చేసుకుంది. డ్యాన్సర్, కమెడియన్, యాంకర్ గా సుభి సురేష్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె నిర్వహించిన సినీమాల, కుట్టి పట్టాలం టీవీ షోలకు ఎంతో ఆదరణ వచ్చింది. ఎన్నో టీవీ షోలలో ఆమె కీలక పాత్ర పోషించారు. 20కు పైగా సినిమాల్లోనూ నటించారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ఆమెకు పేరుంది. అయినా కానీ, కాలేయ అనారోగ్యంతో మృతి చెందడం అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. మిమిక్రీలోనూ ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement