మలయాళ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. గత రాత్రి సీలింగుకి వేలాడుతున్న అపర్ణను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది… కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 33 ఏళ్ల అపర్ణ పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement