Friday, November 22, 2024

మాజీ భ‌ర్త‌తో డిన్న‌ర్ కి వెళ్లిన మ‌లైకా అరోరా.. ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్న నెటిజ‌న్స్

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా త‌న భ‌ర్త‌తో 2017లో విడిపోయింది. కాగా వారికి ఒక కొడుకు ఉన్నాడు. కాగా విడాకులు అనంతరం వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.. కానీ గతేడాది యూఎస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తమ కుమారుడు అర్హాన్ ఖాన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నప్పుడు కలిసి కనిపించారు. అయితే మళ్లీ ఈసారి డిన్న‌ర్ కి వెళ్తూ కనిపించారు.. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో మలైకా తన మాజీ భర్త గురించి ప‌లు విష‌యాలు తెలిపారు. విడిపోయిన తర్వాత కూడా అతను తనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో బాగా చూసుకున్నాడని..

ఆ సమయంలో అతను చూపించిన అభిమానం చూసి చలించిపోయానని తెలిపింది.. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా వచ్చినప్పటికీ కలిసే హోటల్ కి వెళ్లారు.. అక్కడే ఉన్న మీడియా క్లిక్ మనిపించింది.. అయితే ఈ విషయంపై మాత్రం నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్లు చేస్తున్నారు మాజీ భర్తతో డిన్నర్ కు వెళ్లడం ఏంటి.. అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఏమో తన భర్త కుటుంబానికి తన కొడుకు దగ్గరగా ఉన్నాడు కదా.. అలా అయినా వెళ్లి ఉండవచ్చు.. కారణం ఏదైనా కావచ్చు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement