ఏపీ మంత్రి, దళిత నాయకురాలు సుచరితను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అణిచి వేస్తున్నారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రిగా సుచరిత ఉన్నారని… అయినా ఆమె విషయంలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు.
అసలు సర్పంచ్‌గా కూడా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అరుణ్ కుమార్ మండిపడ్డారు. దళితులకు పదవులు ఇచ్చినప్పటికీ… అధికారాన్ని మాత్రం వారి సామాజికవర్గం చేతిలోనే ఉంచుకున్నారని విమర్శించారు. జరుగుతున్న తప్పులను జగన్ సరిదిద్దుకోవాలని, లేకపోతే దళితుల తిరుగుబాటును చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ వార్త కూడా చదవండి: త్వరలో 1,184 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్