ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేతులు కలిపాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సినీ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇదే ప్రజెక్ట్ లో ఇప్పుడు మరో స్టార్ కాస్ట్ని చేర్చారు మేకర్స్. ఈ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్తో దీనిని పాన్ ఇండియా సినిమాగా రూపొందించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడానికి ఎంపికైనట్లు తెలుస్తోంది. కచ్చితంగా విజయ్ సేతుపతి లాంటి అత్యద్భుతమైన పెర్ఫార్మర్ తోడైతే సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయి.
రామ్ చరణ్ – బుచ్చిబాబుల సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా, టీమ్ ఇప్పుడు తారాగణం.. సిబ్బందిని, షూటింగ్ లొకేషన్లను కూడా త్వరగా ఖరారు చేసే పనిలో బిజీ గా ఉంది. తాజా నివేదికల ప్రకారం, ఈ మూవీకి సంగీత దర్శకుడిగా AR రెహమాన్ ఎంపికయ్యారని తెలుస్తోంది.