కరోనాతో పలువురు సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ప్రముఖ మేకప్ మేన్ గంగాధర్ కరోనాతో మంగళవారం మృతి చెందారు. ఉత్తమ మేకప్ మేన్‌గా నంది అవార్డు అందుకున్న ఆయన.. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీ స్టార్‌లకు కూడా మేకప్ మేన్‌గా పనిచేశారు. తెలుగులో ఎక్కువగా లక్కీ మీడియా సంస్థలో చీఫ్ మేకప్ మేన్‌గా సేవలు అందించారు. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా నుంచి తమ బ్యానర్‌లో వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే మేకప్ మేన్‌గా చేశారని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. కాగా హీరో శివాజీకి కూడా పర్సనల్ మేకప్ మేన్‌గా గంగాధర్ కొన్ని సినిమాలకు పనిచేశారు. గంగాధర్ మరణం తనను కలిచివేస్తోందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు శివాజీ తెలిపాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement