Saturday, January 4, 2025

TG | జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయండి.. మంత్రి సీతక్క

ఉట్నూర్, డిసెంబర్ 30 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరిమేరి మండలం కోట పరందొలిలో నిర్వహించే ఆదివాసీల ఆరాధ్య దైవం రాయితాడ్ జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రజా భవన్ లో జంగుబాయి దేవస్థానం నిర్వహణ కమిటీ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలసి ఉత్సవాలకు సంబందించిన గోడ పత్రులను ఆవిష్కరించారు.

ఈసందర్బంగా జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ… పుష్యమాసాన్ని పురస్కరించుకొని ఆదివాసీలు ఎంతో భక్తి శ్రద్దలతో, నియమ నిష్ఠలతో పవిత్రతో రాయితాడ్ జంగుబాయిని ప్రతి ఏడాది దర్శించుకుంటారని తెలిపారు. జనవరి 2వ‌తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరిమేరి మండలం కోటపరండోలి గ్రామంలో జంగుబాయి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జంగుబాయి దేవస్థానం చైర్మన్ శ్యాంరావు, గౌరవ అధ్యక్షుడు కొడప జాకు, సలహాదారులు మరప బాజీరావ్, సమన్వయ కర్తలు తుమ్రం ప్రభ, వెట్టిభూమేష్,దొడంద మాజీ సర్పంచ్ తుమ్రం నాగు, రామారావ్ కటోడ, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు కొడప నగేష్, పుర్క బాపురావ్, మల్కు పటేల్, ఆదివాసీ పెద్దలు, ఆదివాసీ వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement