Monday, November 11, 2024

Make in India – సి-295 విమానాల త‌యారీ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

పాల్గొన్న స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంచెజ్​
21,935 కోట్లతో సైనిక విమానాల‌ తయారీ కేంద్రం ఏర్పాటు
గుజరాత్​లోని వడోదరలో మోదీ, సాంచెస్‌ రోడ్ షో

ఆంధ్రప్రభ స్మార్ట్​, ఆహ్మ‌దాబాద్ ​: గుజరాత్‌లోని వడోదరలో సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సి-295 విమానాల కర్మాగారాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం కర్మాగారంలోని విశేషాలను ఎయిర్‌బస్ సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, టాటా సన్స్‌ ఛైర్మన్ ఎన్‌. చంద్రశేఖరన్ పాల్గొన్నారు. అంతకుముందు మోదీ, సాంచెజ్​ కలిసి ఓపెన్​ జీప్​లో విమానాశ్రయం నుంచి టాటా ఎయిర్​ క్రాఫ్ట్​ కాంప్లెక్స్ వరకు రోడ్​ షోను నిర్వహించారు.

2022లోనే శంకుస్థాప‌న‌..

టాటా అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబరులో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్‌కు 40 సి-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో ₹21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్‌ సంస్థ కర్మాగారం నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్‌లో సిద్ధమవుతాయి. కాలం చెల్లిన ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement