అయ్యప్ప నామ స్మరణతో శబరిమల మారుమోగింది. ప్రతీ ఏడాది మాదిరిగానే.. మకర జ్యోతి దర్శనానికి దేశం నలువైపుల నుంచి భక్తులు శబరిమల భారీగా తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి దర్శనం ఇచ్చిన మకర జ్యోతిని అయ్యప్ప భక్తులు వీక్షించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. ఆలయంలో భక్తులందరికీ.. అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. మకర జ్యోతి దర్శనం ఇవ్వడంతో.. 20వ తేదీన ఆలయం మళ్లి మూసివేయనున్నారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. దీంతో జ్యోతి దర్శనం ఇవ్వగానే భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు. సాయంత్రం 6.51 నిమిషాలకు మకర జ్యోతి దర్శనం ఇచ్చిందని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. అంతకుముందు స్వర్ణాభరణాల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు పూర్తయిన తరువాత భక్తులకు మూడు సార్లు జ్యోతి దర్శనం ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..