Friday, November 22, 2024

Mahua Petition : లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీంకోర్టు నోటీసు

ఢిల్లీ​: టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన విషయం తెలిసందే. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించిన విషయంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా .. లోక్‌ సభ మహువా మొయిత్రిపై వేసిన సస్పెన్షన్‌ వేటుకు సంబంధించి స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.


మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా పూర్తి సమాధానం అందించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటిసు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి మూడో వారానికి వాయిదా చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement