భారతదేశంలోనే అతిపెద్ద థర్డ్ పార్టీ లాజిస్టిక్ (3పీఎల్).. మహేంద్రా లాజిస్టిక్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) కీలక ప్రకటన చేసింది. విజార్డ్ బ్రాండ్ కింద లాజిస్టిక్స్ సేవలు అందిస్తున్న జిప్జాప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అధిక శాతం వాటాలను సొంతం చేసుకున్నట్టు మహేంద్రా లాజిస్టిక్ లిమిటెడ్ తెలిపింది. ఈ వాటా దక్కించుకోవడంతో.. ఎంఎల్ఎల్ ప్రస్తుత లాస్ట్ మైల్ డెలివరీ వ్యాపారం, ఈడెల్, దాని ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఆధారిత డెలివరీ సేవలు మెరుగుపడ్తాయన్నారు. సాంకేతికత ఆధారంగా.. సేవలు విస్తరింపజేయడం అనేది ఎంఎల్ఎల్ లక్ష్యం. ఆ దిశగా తమ సేవలను విస్తరింపజేసేందుకు జిప్జాప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాను కొనుగోలు చేసినట్టు మహేంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ రామ్ ప్రవీణ్ స్వామినాథన్ స్పష్టం చేశారు. ఈ వాటా కొనుగోలుతో.. ఈకామర్స్, ఇతర విభాగాలలో తమ కార్యకలాపాలు మరింత విస్తృతం అవుతాయని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తమ వ్యాపారం కూడా మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు విజార్డ్ బృందం శక్తివంతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఈ భాగస్వామ్యంతో తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.
ఒప్పందం సంతోషకరం..
అనంతరం విజార్డ్ కో-ఫౌండర్లు అంకిత్ మదానియా, అరుణ్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలో ఎంతో పేరొందిన లాజిస్టిక్స్ కంపెనీలలో మహేంద్రా లాజిస్టిక్స్ ఒకటన్నారు. తమ కంపెనీ.. ఎంఎల్ఎల్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యంతో రెండు కంపెనీలకు వ్యూహాత్మక ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. రాబోయే మరికొన్నేళ్లలో.. కంపెనీల వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..