Tuesday, November 19, 2024

జర్నీస్‌ డీ లా ఫ్రాంకో ఫోనీ 2022ను నిర్వహించిన మహీంద్రా యూనివర్శిటీ..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మల్టీ డిసిప్లీనరీ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌లలో ఒకటైన మహీంద్రా యూనివర్శిటీ తమ మొట్టమొదటి ఫ్రాంకోఫోనీడేను జర్నీస్‌డీలా ఫ్రాంకోఫోనీ 2022 శీర్షికన 22 మార్చి నుంచి 24 మార్చి 2022 వరకూ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహీంద్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ యజ్‌ మెడ్యురీతో పాటుగా హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ డీన్స్‌, హెడ్స్‌ పాల్గొన్నారు. మహీంద్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ యజ్‌ మెడ్యురీ మాట్లాడుతూ…. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల మంది ఫ్రెంచ్‌ మాట్లాడే వ్యక్తులున్నారన్నారు.

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఫ్రెంచ్‌ ఒకటన్నారు. ఈ కార్యక్రమం ఫ్రెంచ్‌ భాష, సంస్కృతి ఏకీకృత స్ఫూర్తికి నిదర్శన మన్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఆసక్తి కలిగిన విద్యార్థులు పోటీపడటంతో పాటుగా పోస్టర్‌ మేకింగ్‌, కరవొకె, కవిత్య పఠనం, క్విజ్‌ పోటీలలో బహుమతులు గెలుచుకున్నారన్నారు. ఈ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement