Tuesday, November 12, 2024

అమ్మ‌కాల్లో మ‌హీంద్రా రికార్డ్..

వాహన రంగ దిగ్గజ కంపెనీ మహీంద్రా ఫిబ్రవరి విక్రయాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకుంది. రికార్డు స్థాయిలో 89 శాతం వాహనాలు అధికంగా అమ్ముడు పోయినట్టు కంపెనీ వివరించింది. 2022, ఫిబ్రవరిలో మొత్తం 54,455 వాహనాలను విక్రయిం చినట్టు ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. 89శాతం అధికమని తెలిపింది. యుటిలిటీ వెహికిల్స్‌ సెగ్మెంట్‌లో 27,551 వాహనాలు ఒక్క 2022, ఫిబ్రవరిలోనే అమ్ముడు పోయాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. 79 శాతం అధికమని ప్రకటించింది. ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో.. (యూవీ, కార్లు, వ్యాన్లు) గతేడాదితో పోలిస్తే.. 80శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరిలో 27,663 ప్యాంసిజర్‌ వాహనాలు అమ్ముడు పోయాయి. ఇక విదేశాలకు ఎగుమతి విషయాని కొస్తే.. 54 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2814 వాహనాలను మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ ఎగుమతి చేసింది. గతేడాది ఫిబ్రవరిలో 1827 యూనిట్లను ఎగుమతి చేసినట్టు వివరించింది. కమర్షియల్‌ వాహన రంగంలో.. 2022, ఫిబ్రవరిలో 20166 వాహనాలు అమ్ముడు పోయాయి.

గతేడాదితో పోలిస్తే.. 119 శాతం అధికం. కమర్షియల్‌ వాహన అమ్మకాల్లో తమ కంపెనీ ఆల్‌ టైం రికార్డు సృష్టించినట్టు ప్రకటించింది. హెవీ కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నా యనితెలిపింది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ ఆటో మోటివ్‌ డివిజన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ విజయ్‌ నక్రా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు జరిగినట్టు వివరించారు. వాహన ప్రియులకు మెచ్చేలా మోడల్స్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపారు. 54, 455 యూనిట్ల అమ్మకాలు ఒక్క ఫిబ్రవరిలోనే నమోదైనట్టు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహనాలకు ఎంతో ఆదరణ ఉందని, ఇది నానాటికీ పెరుగుతూ పోతోందన్నారు. 100కు పైగా దేశాల్లో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని, 2,60,000 మంది సిబ్బంది పని చేస్తున్నారని ప్రకటిచాంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement