న్యూఢిల్లి : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను రెగ్యులేటరీ వద్ద ఫైల్ చేసింది. మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం 2021-22లో వందల కోట్ల రూపాయల లాభాలను తన ఖజానాలో జమ చేసుకుంది. 17 శాతం మేర పురోభివృద్ధిని రికార్డు చేసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,167 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. జనవరి-ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో 17 శాతం మేర లాభాలను రికార్డు చేసినట్టు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చుకుంటే.. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ 427 శాతం పెరిగినట్టు తెలిపింది. అప్పట్లో రూ.245 కోట్ల స్టాండ్‌లోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అందుకోగా.. ఇప్పుడు అది నాలుగింతలు పెరిగింది. రూ.1,292 కోట్లకు చేరుకుంది.
మొత్తం రెవెన్యూ రూ.17వేల కోట్లు..
ఈ నాలుగో త్రైమాసికంలో నమోదైన మొత్తం రెవెన్యూ రూ.17,147 కోట్లు. ఇందులో 28 శాతం వృద్ధి కనిపించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.13,356 కోట్లుగా ఉండింది. ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డెప్రిసియేషన్ (ఈబీఐటీడీఏ) మొత్తం రూ.1946 కోట్లు. ఇదే ఎబిడా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.1,955 కోట్లుగా ఉండింది. మహీంద్రా అండ్ మహీంద్రా నమోదు చేసిన నికర లాభాల్లో 401 శాతం పెరుగుదల నమోదైంది. రూ.4935 కోట్ల నికర లాభాన్ని అందుకుంది. అంతకుముందు సంవత్సరం ఈ సంఖ్య రూ.984 కోట్లుగా ఉండింది. రెవెన్యూలో 29 శాతం పెరుగుదల కనిపించింది. రూ.44,630 కోట్ల నుంచి రూ.57,446 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 1,52,204 వాహనాలు విక్రయించింది. ఇందులో 43 శాతం క్షీణత నమోదు చేసుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యం.. షేర్ హోల్డర్స్‌కు శుభవార్త వినిపించింది. వారికి రూ.11.55 డివిడెంట్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌కు ఈ మొత్తాన్ని అందించనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..