హైదరాబాద్ : మహీంద్రా అండ్ మహీంద్రా పైనాన్షియల్ సర్వీసెస్‌కు అనుబంధ సంస్థ అయిన మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ , వ్యవసాయ డిజిటల్ వేదిక బిగ్‌హాత్ తో జత కలిసింది. దేశంలో అసంఘటిత వ్యవసాయ రంగానికి పరిష్కారాలను అందించనున్నట్లు ఈ సంస్థలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతంలోనూ బీమా వేగంగా పెరిగేందుకు కృషి చేయనున్నట్లు తెలిపాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆరోగ్య, మోటార్ బీమా పాలసీలను మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అందిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో బీమా పరంగా బాగా వెనుకబడి ఉన్నందున, అవకాశాలు అపారంగా ఉన్నాయని, బిగ్‌హాత్ భాగస్వామ్యంతో పేద, వ్యవసాయ కుటుంబాల వారికి సామాజిక, ఆర్థిక భద్రత అందించడం సాధ్యమవుతుందని ఎంఐబీఎల్ ఎండి , ప్రిన్సిపల్ ఆఫీసర్ వేదనారాయణన్ శేషాద్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పని చేస్తుంటారని, వారి వ్యవసాయ పనిముట్లు ముఖ్యంగా ట్రాక్టర్ వంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ సరిగా ఉందని, వీరికి ఈ సేవలు అందించడం ద్వారా ఈ వర్గాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని బిగ్‌హాత్ ఇండియా కో-ఫౌండర్ సతీష్ నూకల అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.