మహీంద్రా గ్రూప్‌లోని సుప్రసిద్ధ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్) ప్రత్యేక డిపాజిట్ పథకాలను ఏర్పాటు చేసింది. డిజిటల్ పరిజ్ఞానం కలిగిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తమ డిజిటైజేషన్ డ్రైవ్‌లో భాగంగా ప్రత్యేక డిపాజిట్ పథకాలను విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నేటి డిజిటల్ ప్రపంచంలో డిపాజిటర్లు నేరుగా డిపాజిట్లు తీసుకుంటున్న కంపెనీలను డిపాజిట్లు చేయడం కోసం సంప్రదించే అవకాశం ఉంది. దీని ఆధారంగా మహీంద్రా ఫైనాన్స్ వినూత్నమైన పథకాన్ని ప్రకటించింది. 20బీపీఎస్ అత్యధిక వడ్డీరేట్లను ప్రత్యక్ష డిపాజిట్లపై అందిస్తుంది.
ఈ సందర్భంగా మహీంద్రా ఫైనాన్స్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కార్వీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక డిపాజిట్ పథకాలు డిజిటల్ పద్ధతిలో బహుళ ఆర్థిక, పెట్టుబడి పథకాలు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ ఫిక్స్డ డిపాజిట్ పథకాలు ఎఫ్‌ఎఎఎ రేటింగ్‌ను క్రిసిల్ నుంచి అందుకున్నాయన్నారు. కంపెనీ ప్రత్యేక డిపాజిట్ పథకాల పూర్తి వివరాలను తమ కంపెనీ వెబ్‌సైట్ మహీంద్రా ఫైనాన్స్.కామ్‌లో చూడవచర్చని వివేక్ కార్వీ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..