Saturday, November 23, 2024

2లక్షల ఈవీల అమ్మకాలే లక్ష్యం… మహీంద్రా ఈవీ ప్రణాళికలు

ప్రముఖ వాహన సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా 2027 నాటికి రెండు లక్షల విద్యుత్‌ వాహనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ భారీ ఎత్తున విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. విద్యుత్‌ వాహనాల విషయంలో పరిశోధనా, డిజైన్‌, టెక్నాలజీ అభి వృద్ధి పై 1 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో 5 విద్యుత్‌ వాహనాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. 2027 నాటికి విద్యుత్‌ వాహనాల మార్కెట్‌లో 20 నుంచి 30 శాతం వాటా సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈడీ రాజేష్‌ జీజురేకర్‌ తెలిపారు. రెండు లక్షల వాహనాల అమ్మకాలు తమ లక్ష్య మని ఆయన చెప్పారు.

బ్రిటన్‌కు చెందిన బ్రిటీష్‌ ఇంటర్నే షనల్‌ ఇన్వె స్ట్‌మెంట్‌ సంస్థ 250 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని చెప్పా రు. ఈ కంపెనీతో కలిసి ఈవీ వాహనాల ఉత్పత్తి కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు విద్యుత్‌ వాహనాల తయారీపై మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఎండీ అనీష్‌ షా తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు 15న కంపెనీ బ్రిటన్‌లో విద్యుత్‌ కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. 2022, సెప్టెంబర్‌లో ఎక్స్‌యూవీ 400 కారును మన దేశ మార్కెట్‌లో విడుదల చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement