Wednesday, November 20, 2024

మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కాన్‌క్లేవ్‌, ఈవీ త్రీ వీలర్‌ వాహనాల ప్రదర్శన..

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన.. మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌, పూణే ఆల్టరేట్‌ ఫ్యూయెల్‌ కాన్‌క్లేవ్‌లో ట్రియో ఆటో, ట్రియో జోర్‌ డెలివరీ వ్యాన్‌, ట్రియో టిప్పర్‌ వేరియంట్‌, ఈ-ఆల్ఫా మినీ టిప్పర్‌ వేరియంట్‌తో పాటు ఆటమ్‌ క్వాడ్రి సైకిల్‌ డిస్‌ప్లేతో విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రదర్శిస్తోంది. స్మార్ట్‌ ఇండియా ద్వారా చివరి మైలు రాయి వరకు కనెక్టివిటీ కోసం ఎలక్ట్రిక్‌ అర్బన్‌ మొబిలిటీ సొల్యూషన్‌ పాటుపడుతున్నది. ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ విభాగంలో మహీంద్రా కంపెనీ 73.4 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌లో ఉంది. మహీంద్రా శ్రేణి ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లు భారతదేశం అంతటా వినియోగదారులకు సేవలు అందిస్తున్నది. భారతదేశంలోని ఏకైక ఎలక్ట్రిక్‌ క్వాడ్రిసైకిల్‌ అయిన ఆటమ్‌ 2020 ఆటో ఎక్స్‌పో తరువాత ప్రదర్శించడం ఇదే తొలిసారి. సరికొత్త భారతదేశాన్ని ఆకర్శించేలా ఆటమ్‌ రూపొందించబడింది. ఈ ఎక్స్‌పో క్లీన్‌, సౌకర్యవంతమైన, స్మార్ట్‌ లక్షణాలను అందిస్తుంది. మహీంద్రా తాజా ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ ద్వారా ఆధారితమైన, ఆటమ్‌ విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఇంకా మోనోకోక్‌ బాడీ నివాసితులకు సురక్షితమైన ఎన్‌క్లోజర్‌ను అందిస్తుంది.

టెలిమాటిక్స్‌ కనెక్టివిటీ..

సమర్థవంతమైన నిర్వహణ కోసం ఆటమ్‌.. టెలిమాటిక్స్‌ కనెక్టివిటీతో కూడా వస్తున్నది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఆటమ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కాన్‌క్లేవ్‌కు హాజరైన మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ… పూణె ఆటో హబ్‌ అని, దీంతో పాటు కాన్‌క్లేవ్‌కు అనువైన వేదికగా అభివర్ణించారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఐడీసీ), మహారాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (ఎంపీసీబీ), మహరత్తా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఎంసీసీఐఏ) సంయుక్తంగా ఈ కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఆర్‌టీఓ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. సులభమైన ఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని అందించడానికి బ్యాంకు కియోస్క్‌లను కూడా కలిగి ఉందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement