Saturday, November 23, 2024

మహింద బృందం దేశం విడిచివెళ్లొద్దు.. శ్రీలంక కోర్టు ఆదేశం

కొలంబో:మాజీ ప్రధాని మహింద రాజపక్సే, ఆయన తనయుడు సహా 176మంది దేశం విడిచివెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ప్రజలపై అధికారపక్షం దాడులకు దిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి ట్రింకోమలీ నౌకదళ స్థావరంలో తలదాచుకున్న మహింద దేశం విడిచివెళ్లనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొందరు కోర్టునాశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఫోర్ట్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వారిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై అధికారపక్షం దాడులకు పాల్పడటం వల్లే హింస చెలరేగిందన్న అంశంపై విచారణకు ఆదేశించింది. అధికారపక్షం దాడులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ విచారణ పూర్తయ్యేవరకు మాజీ ప్రధాని మహింద, ఆయన తనయుడు నమల్‌ రాజపక్సతో పాటు మరో 15మందిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది. కాగా తన తండ్రి మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లబోరని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని నమల్‌ రాజపక్స ట్విట్టర్‌లో స్పందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement