సినిమా ప్రేమికులకు 2023 వేసవి పండుగ కానుంది. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కొత్త సినిమాలను రిలీజ్ కానున్నాయి.
RC15
శంకర్ దర్శకత్వలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా #RC15 (వర్కింగ్ టైటిల్). చరణ్ 15వ సినిమాగా రూపోందుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రభుత్వ వ్యవస్ధకు సంబంధించిన సామాజిక డ్రామాగా రూపోందుతుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ IAS అధికారిగా నటిస్తున్నారు. అక్టోబర్ కల్లా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారు మూవీ మేకర్స్. కానీ ఈ సినిమాను పాన్-ఇండియన్ లెవెల్ లో చేయాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల అయ్యే చాన్స్ ఉంది. అయితే దాదాపు 350 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఇక ఈసనిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
SSMB28
2023 వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా నిర్మాతలు అధికారికంగా ధృవీకరించారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాకి పూజా హెగ్డే, రాధా కృష్ణ బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అంధించనున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది.
NTR30
దర్శకుడు కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎన్ టియార్ తో కలిసి #NTR30 చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఎక్కువ సమయం వృథా చేయద్దని ఫిక్స్ అయ్యాడు కొరటాల. 7 లేదా 8 నెలల్లో #NTR30 షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మే 2023లో థియేటర్లలోకి రావచ్చు.ఈ మూవీ కూడా పాన్-ఇండియా లెవెల్ లో రూపోందిచబడుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
Salaar
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపోందుతున్న అల్టిమేట్ ఆక్షన్ మూవీ సలాన్ పై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ ‘సాలార్’ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. జనవరి లేదా మార్చి నాటికి ప్రొడక్షన్ పనులు పూర్తయితే.. ‘సాలార్’ మొదటి భాగం 2023 వేసవిలో థియేటర్లలోకి వస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.