Saturday, November 23, 2024

మ‌హేశ్ భ‌ట్ కి హార్ట్ స‌ర్జ‌రీ.. కోలుకుంటున్నార‌న్న కుమారుడు

హీరోయిన్ ఆలియాభ‌ట్ తండ్రి.. బాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత మహేశ్ భ‌ట్ కి హార్ట్ స‌ర్జ‌రీ జరిగింది. గత నెలలో ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లగా.. త్వరగా హార్ట్‌ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆయ‌న యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉండి కోలుకుంటున్నారు. మహేశ్‌ భట్‌ ఆరోగ్యంపై ఆయన కుమారుడు రాహుల్‌ భట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ వారం మొదట్లో మహేశ్‌ భట్‌ ఆసుపత్రిలో చేరినట్లు రాహుల్‌ తెలిపాడు. గుండె శస్త్ర చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారన్నారు. బాగానే కోలుకుంటున్నాడని, ఇంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేనని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement