Thursday, November 21, 2024

‘సైమా’ అవార్డుల నామినేషన్‌లలో సత్తా చాటిన మహేష్ సినిమా

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘సైమా’ అవార్డులను నటీనటులు, టెక్నీషియన్‌లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా సైమా అవార్డుల వేడుక నిర్వ‌హించ‌లేదు. అయితే ఈ ఏడాది హైద‌రాబాద్‌లో సైమా వేడుక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. తాజాగా 2019 సంవత్సరానికివివిధ కేటగిరీలలో నామినేట్ అయిన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో ‘మహర్షి’ (తెలుగు), ‘అసురన్’ (తమిళం), ‘యజమానా’ (కన్నడ), ‘కుంబలంగి నైట్స్’ (మలయాళం) చిత్రాలు సైమా నామినేషన్ లలో ముందున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ మూవీ 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిలిం ,బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ,బెస్ట్ లిరిసిస్ట్ ,బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) , బెస్ట్ విలన్ , బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీలలో నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ‘మహర్షి’ నామినేట్ అయింది. నాగచైతన్య, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ‘మ‌జిలీ’ చిత్రం 9 విభాగాల‌లో నామినేట్ కాగా, నాని- గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో రూపొందిన జెర్సీ 7 విభాగాల‌లో నామినేట్ అయింది. మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘కుంబళంగి నైట్స్’ ఏకంగా 13 కేటగిరీలలో నామినేట్ అవడం గమనార్హం. కన్నడ ‘యజమాన’ సినిమా 12 నామినేషన్లు పొందింది.

ఈ వార్త కూడా చదవండి: శ్రీముఖి 31 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటుందట

Advertisement

తాజా వార్తలు

Advertisement