Tuesday, November 26, 2024

Gunturu Karam Pre release Event – నాన్న లేని లోటు మీరే తీర్చాలి… మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ గుంటూరు లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తండ్రి కృష్ణను తలుచుకొని స్టేజిమీదనే కంటతడి పెట్టుకున్నాడు. తన తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని కోరాడు.

” గుంటూరులో మొదటిసారి ఫంక్షన్ జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా త్రివిక్రమ్ వలనే జరిగింది. ఆయనే గుంటూరు లో ఫంక్షన్ చేయాలనీ సూచించారు. అలా అనగానే మేము కూడా ఓకే అనేశాము. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్ కన్నా ఎక్కువ.. మా ఫ్యామిలీ మెంబర్ లా. ఆయన గురించి బయట నేను మాట్లాడను.. ఒక కుటుంబ సభ్యుడి గురించి బయట ఏం మాట్లాడతాం. గత రెండేళ్లలో ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను. ఆయనకు థాంక్స్ చెప్పడం కూడా వింతగానే ఉంది నాకు.. ఎందుకంటే మేమెప్పుడూ ఇలా మాట్లాడుకోము. ఆయన సినిమాలు చేసినప్పుడల్లా.. నాలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అతడు సినిమాకు జరిగింది.. ఖలేజాకు.. ఇప్పుడు గుంటూరు కారంకు కూడా జరిగింది. మీరొక కొత్త మహేష్ ను చూస్తారు. దానికి కారణం త్రివిక్రమ్.. వీరి ముందు కాకపోతే ఇంకెవరి ముందు చెప్పలేను. ఐ లవ్ యూ. ఇక మా ప్రొడ్యూసర్ చినబాబుకు నేనే ఫెవరేట్ హీరో.. ఒక నిర్మాత ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరు. మీతో ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ఉంది

ఆమెతో డ్యాన్స్ అంటే…తాట ఊడిపోతుంది.

ఇక లీల.. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వడం.. చాలా డేడికేట్ డ్ గా ఉంటుంది. షాట్ ఉన్నా లేకున్నా అక్కడే ఉంటుంది మేకప్ వ్యాన్ లోకి వెళ్ళదు. ఇక ఆమెతో డ్యాన్స్ అంటే.. వామ్మో.. అదేం డ్యాన్స్.. హీరోలందరికీ తాట ఊడిపోతుంది. కానీ, ఆమెతో వర్క్ చేయడం చాలా బావుంది.

ఇక మీనాక్షీ ఒక గెస్ట్ రోల్ చేసింది. ఆమెకు కూడా థాంక్స్. ఇక థమన్.. అతను అంటే నాకు చాలా ఇష్టం.. తమ్ముడి లెక్క.. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్.. నేను, గురూజీ అడిగి చేయించుకున్నాం. ఈ సాంగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇందాక నా 25 ఏళ్ళ ఏవీ చూపించారు. ఇన్నేళ్లు మీరు చూపించిన అభిమానం నేనెప్పుడూ మర్చిపోలేను .

ప్రతియేడు అది పెరుగుతూనే ఉంటుంది. మీ అభిమానానికి నేను ఋణం తీర్చుకోలేను.. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదు.. మీరెప్పుడు నాకు గుండెల్లో ఉంటారు. సంక్రాంతి మాకు కలిసివచ్చింది. సంక్రాంతికి మా సినిమా వచ్చింది అంటే అది హిట్. ఈసారి కూడా బాగా గట్టిగ కొడతాం.. కానీ, ఈసారి కొత్తగా ఉంది. ఎందుకంటే ఈసారి నాన్నగారు మనమధ్య లేరు. ఆయన నా సినిమా చూసి రికార్డులు కలక్షన్స్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆయన కాల్ కోసమే ఈ సినిమాలు అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరా నాకు అమ్మ, మీరే నాకు నాన్న.. మీరీ నాకు అన్నీ.. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement