మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యల్ని వింటున్నాం ఇది బాధాకరమని, మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే అని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో చేసిన త్యాగాలు ఈనాటి తరానికి తెలియవన్నారు. 1987 సిపాయిల తిరుగుబాటు కీలకం అని, సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా అణచివేసిందన్నారు. వారి తిరుగుబాటు విఫలమైనా స్వాతంత్య్రం కోసం మరింత బలమైన పోరాటాన్ని కొనసాగించారని అన్నారు. మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యల్ని వింటున్నాం.. ఈ వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు. వీటిని ఎవరైనా సరే ఖండించాలన్నారు. ఆ శక్తుల చిల్లర ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవన్నారు. మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే అన్నారు. పేదరికం ఉన్నంత వరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతాయి. పేదరికాన్ని నిర్మూలిస్తేనే సమానత్వం, స్వేచ్ఛ లభిస్తాయన్నారు. ప్రశాంత భారతంలో జాతిని చీల్చే కుట్రను తిప్పికొట్టాలని, అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన యోధులందరికీ మన అందరి తరపున నివాళులు అల్పిస్తున్నాం అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement