న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. సోమవారం భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జాతిపిత 154వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హిమాంశు మాట్లాడుతూ అహింసతో శాంతియుత, సామరస్య సమాజం సాధ్యమని గాంధీజీ నమ్మి ఆచరించారని పేర్కొన్నారు. వ్యక్తిత్వ పరివర్తనతోనే సమాజ పరివర్తన సాధ్యమని నమ్మడమే గాంధేయవాదమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.