Saturday, November 23, 2024

Maharastra – ముఖ్య‌మంత్రి పీఠం కోసం షిండే ప‌ట్టు .. దేవేంద్ర ఫడ్నవీస్ వైపు బిజెపి చూపు

అత్యధిక స్థానాలు సాధించిన పార్టీ బిజెపి
బిజెపికే ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటున్న ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చేది లేదంటున్న ఏకనాథ్ షిండే

ముంబై – అధికార మహయతి కూటమి రెండో సారి మహారాష్ట్రలో అధికారం చేపట్టనుంది. ఇప్పటికే మెజార్టీకి అవసరమై 145 సీట్ల కంటే అదనంగా 70 స్థానాలు అధికంగా సాధించింది. దీంతో కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (షిండే వర్గం) చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ (అజిత్ వర్గం) చీఫ్ అజిత్ పవార్ లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం పట్టుపడుతున్నారు. బిజెపికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదంటూ ఏక్ నాద్ షిండే వర్గీయలు తేల్చి చెబుతున్నారు..

తమ వల్ల తిరిగి అధికారం వచ్చిందని, ఆ పదవి తమ పార్టీకే దక్కాంటున్నారు ఆ పార్టీ నేత‌లు . ఆయా పార్టీల్లో కిందిస్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చుని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. ఇక ఈ నెల 25వ తేదిన బిజెపి శాస‌న స‌భ ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలోబిజెపి ఎమ్మెల్యే లు త‌మ నేత‌ను ఎన్నుకోనున్నారు.. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం దేవంద్ర ఫ‌డ్నవీస్ బిజెపి ప‌క్ష నేత‌గా ఎన్నిక కావ‌చ్చ‌ని అంటున్నారు.. ఇది ఇలా ఉంటే ఈ నెల 26న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement