మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని పిషోర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నాటిన మొక్కను ఓ మేక మేసింది. మొక్క తిన్న తర్వాత కూడా అది పారిపోలేదు. బిందాస్ నిశ్చలంగా అక్కడే నిలబడిపోయింది. దీంతో పోలీసులు మేం నాటిన మొక్కనే తింటవా అంటూ కఠినంగా వ్యవహరించారు. హడావుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మేకను రోజంతా స్టేషన్లోనే కట్టేసి ఉంచారు. మూడు వేల విలువైన మేకకు, దాని యజమానికి రెండు వేలు జరిమానా విధించారు. యజమానికి,మేకకు కూడా ఒక రోజు జైలు శిక్ష విధించారు.
.ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా కన్నడ తహసీల్ పిషోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేక యజమాని పేరు రౌఫ్ రజాక్ సయ్యద్. మేక యజమానిపై ఐపీసీ సెక్షన్ 90(ఏ) కింద కేసు నమోదు చేశారు. పిషోర్ పోలీస్ స్టేషన్ ఈ వింత చర్య సోషల్ మీడియాలో చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..