Wednesday, November 13, 2024

Maharastra – కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌లో అంతా దోపిడినే – ప్ర‌ధాని మోదీ

మ‌హ‌రాష్ట్ర ఎన్నిక‌ల కోసం క‌ర్నాట‌క నుంచి నిధులు
అక్క‌డి ప్ర‌భుత్వాలు కాంగ్రెస్ పార్టీకి ఎటిఎంలే
అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే మ‌హారాష్ట‌ను దోచేస్తారు
అంకోలా ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోదీ

అంకోలా – కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల‌లో అంతా దోపిడియేన‌ని, అక్క‌డి ప్ర‌భుత్వాల‌ను కాంగ్రెస్ పార్టీ ఎటిఎం లు వాడుకుంటున్న‌ద‌ని మండి ప‌డ్డారు ప్ర‌ధాని మోదీ… మహారాష్ట్రలోని అకోలాలో నేడు జ‌రిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్నికల పేరుతో కర్ణాటకలో వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రధాని మోడీ అన్నారు.ఇప్ప‌టికే కర్ణాటకలో మద్యం దుకాణదారుల నుంచి రూ.700 కోట్లు రికవరీ చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పడితే ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజకుటుంబానికి ఏటీఎంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం హిమాచల్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్ రాజకుటుంబానికి ఏటీఎంలుగా మారాయి. . స్కాములతో ఎన్నికల్లో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్ని కుంభకోణాలకు పాల్పడుతుందో గ‌ణాంకాల‌తో వివ‌రించారు మోదీ

- Advertisement -

మహారాష్ట్ర ప్ర‌జ‌లు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధాని కోరారు. మహా అఘాదీ పెద్ద మోసగాళ్ల ఏటీఎంగా మహారాష్ట్ర మారడాన్ని తాము అనుమతించబోమ‌ని అన్నారు. మహారాష్ట్ర ఆశీస్సులు బీజేపీకి ఉన్నాయంటూ . . మహారాష్ట్రకు సేవ చేయడంలో ఉన్న ఆనందం వేర‌ని చెప్పుకొచ్చారు మోదీ. కేంద్రంలో త‌న‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే గడిచిందన్నారు. ఈ ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఎన్నో పథకాలు ప్రారంభించామని ర్కొన్నారు.

గత రెండేండ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధాని మోడీ చెప్పారు. పేదలకు మరో 3 కోట్ల కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. మహారాష్ట్రలోని పేదల శాశ్వత ఇళ్లు కల నెరవేరనుంద‌న్నారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని అన్నారు. మహాయుతి ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధిని రెట్టింపు వేగంతో ముందుకు తీసుకెళ్తుంద‌న్నారు. త‌మ‌కు మొదటి దేశం అనే భావన ప్రధానమ‌న్నారు… దేశం మొదటి స్ఫూర్తి భారతదేశానికి నిజమైన బలమన్నారు మోడీ. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, కాంగ్రెస్ దళిత సమాజాన్ని ఏకం చేయడానికి ఎప్పుడూ అనుమతించలేద‌న్నారు , ఎస్టీ సమాజాన్ని వివిధ కులాలుగా విభజించింద‌ని మండి ప‌డ్డారు.. ఓట్ల రాజ‌కీయం చేసే ఆ పార్టీని ఈ ఎన్నిక‌ల‌లో చిత్తు చేయాల‌ని పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement