Saturday, November 23, 2024

Maharastra – మోదీ కోవ‌ర్ట్ ల అడ్డాగా మ‌హారాష్ట్ర‌ – ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

అర్దిక రాజ‌ధానిని విద్రోహులు అడ్డ‌గా మార్చింది అయ‌నే
11 ఏళ్ల మోదీ పాల‌నలో ఒక్క స‌క్సెస్ స్టోరీ కూడా లేదు
పుణే ఏన్నిక‌ల ప్ర‌చారంంలో మోడీపై రేవంత్ రెడ్డి గ‌రం గ‌రం

పుణే – పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక సక్సెస్ స్టోరీ లేదన్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ఈ పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని ఎద్దేవా చేశారు . ప్రతిసారి బాంబు పేలుళ్లు.. ఇతర కొత్త కొత్త అంశాలను ప్రధానమంత్రి మోదీ.. బీజేపీ ఎన్నికల ముందుకు తెరపైకి తెస్తున్నాయ‌ని.. చెప్పుకోవడానికి ఏం లేకనే వాటిపై ఆధారపడుతున్నారని తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పుణేలో నేడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 2002కు ముందే దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చారని తెలిపారు

మోడీకి… పదకొండేళ్ల కాలంలో దేశంలోనూ, మహారాష్ట్రలోనూ విజయగాథలు (సక్సెస్ స్టోరీలు) ఏం లేవన్నారు. ముంబయి దేశానికి ఆర్థిక రాజధాని… మహారాష్ట్రలో రాజకీయంగా దేశంలో రెండో పెద్ద రాష్ట్రం..అటువంటి రాష్ట్రాన్ని మోదీ కోవర్ట్ ఆపరేషన్లు.. విద్రోహుల అడ్డాగా మార్చారన్నారు. చిన్న కార్యకర్త శిందేను బాలాసాహెబ్ మంత్రి వరకు తీసుకువస్తే ఆయనను ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మోదీకి గులాంగా మారారని తెలిపారు. శరద్ పవార్ సొంత బిడ్డను కాదని సోదరుని కుమారుడు అజిత్ పవార్‌ను మంత్రి పదవులు ఇస్తే ఆయనను మోడీకి గులాంగా మారారని మండిపడ్డారు. అశోక్ చవాన్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన మోదీకి గులాంగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయిలోని ధారావిని కబ్జా చేసేందుకు విద్రోహులైన శిందే, అజిత్ పవార్, అశోక్ చవాన్‌ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. రూ.12 కోట్ల మహారాష్ట్ర ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఇది ఎన్నిక కాదు.. ఇదో యుద్ధం.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు మహారాష్ట్రను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి (ఎంవీఏ) ఓటు వేయాలన్నారు. .

ఇక మోదీ పాల‌న‌లో 16 నెలల పాటు రైతులు ధర్నాలు, ఆందోళనలు చేశారన్నారు. ఆ సమయంలో 700 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.… ఈ విషయంపై ప్రధానమంత్రి మాట్లాడరు..? అని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్‌సభలో ప్రశ్నించా అన్నారు. కేవలం 7.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సమాధానం ఇచ్చార‌న్నారు. అంటే పదకొండేళ్ల పాలనలో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రైతులు, పేదలు, ఉద్యోగాల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలంటిన్నిలో విఫలమైన నరేంద్ర మోదీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తాను సవాల్ విసురుతున్నా అన్నారు. కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపాలని తెలిపారు. వాళ్లకు వివరాలు ఇస్తాం అవసరమైతే వారి విమాన ఖర్చులు తామే భరిస్తామన్నారు.

తెలంగాణాలో తాను అధికారంలోకి వ‌చ్చిన 50 రోజుల్లో రైతుల రుణ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణ మాఫీ చేశామ‌న్నారు … ప్రతి రైతు ఖాతా వివరాలు అందిస్తామన్నారు. తెలంగాణలో యువతకు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామ‌ని వెల్ల‌డించారు.. ఎల్‌బీ నగర్ స్టేడియంలో స్వయంగా తాను నియామక పత్రాలు అందించా అన్నారు. తెలంగాణలో మహిళలు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయణించే అవకాశం కల్పించామ‌న్నారు. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. 2004లో సోనియా గాంధీ సూచన మేరకు దీపం పథకం కింద రూ.400 కే గ్యాస్ సిలిండర్..స్టవ్ కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూ.400 గ్యాస్ సిలిండర్‌ను రూ.1200కు పెంచారన్నారు. సిలిండర్ ధర పెంపు ద్వారా పేద మహిళలు రూపాయి రూపాయి వంటింట్లో దాచుకున్న డబ్బును మోడీ చోరీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేద మహిళలకు రూ.500కే సిలిండర్ ఇస్తున్నామ‌ని, … 50 లక్షల కుటుంబాలు రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం.. కావాలంటే ఆ వివరాలు అందిస్తామన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ రానంత ధాన్యం దిగుబడి తెలంగాణలో ఈ సారి వచ్చిందన్నారు. మొత్తం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది.. ఎమ్మెస్పీకి అదనంగా రైతులకు ప్రతి క్వింటాకు మా ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు గానూ సోనియా గాంధీ నేతృత్వంలో దేశంలోనే మొదటి సారిగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇప్పుడు దానిని తెలంగాణలో తాము రూ.10 లక్షలకు పెంచాం…పేదల వైద్యానికి ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. త‌మ‌ గ్యారంటీలు కచ్చితమైన గ్యారంటీల‌ని అన్నారు .,.. మోదీ వి భారతీయ జుటా పార్టీ గ్యారంటీల‌ని ఎత్తి చూపారు.. బీజేపీ నాయకులు రేపు హైదరాబాద్ వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్రతి అంశం వివరాలు అందజేస్తా అందులో ఏమైనా తప్పు ఉంటే క్షమాపణలు చెబుతా అన్నారు.

మహారాష్ట్రలో ఎంవీఏను గెలిపిస్తే తెలంగాణలో అమలవుతున్న అన్ని హామీలు మహారాష్ట్రలో అమలవుతాయన్నారు. విలేకరుల ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి జవాబులు అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు చట్టపరంగా చేయాల్సినవి… తెలంగాణలో మేం 4 శాతం అమలు చేస్తున్నాం.. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement