జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు
మహారాష్ట్రలో ఠాక్రే శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ కూటమి
ఝార్ఖండ్ లో అధికార పార్టీతో బిజెపి ఢీ
జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించింది.. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది. ఇక, జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025తో ముగియనుంది. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మహరాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తుండగా, జార్ఖండ్ లో రెండు దశలలో ఎన్నికలు జరగనున్నాయి.. మహారాష్ట్రలో నామినేషన్ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కానుంది.. పోలింగ్ నవంబర్ 20న నిర్వహిస్తుండగా, కౌంటింగ్ నవంబర్ 23న జరపనున్నారు.
ఇక జార్ఖండ్ లో పోలింగ్ నవంబర్ 13, 20 తేదీలలో జరగనుండగా, కౌంటింగ్ నవంబర్ 23న చేపడతారు.
అయితే, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధికార మహాయుతి కూటమి శివసేన (షిండే), ఎన్‌సీపీ (అజిత్ పవార్)తో పాటు శివసేన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి మధ్య ద్విముఖ పోరు సాగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, ఠాక్రే శివసేన వర్గంతో సీట్ల సర్దుబాటు చర్చలు జరగుతున్నాయి. దీనిలో భాగంగా ముంబయిలో శివసేన 13 చోట్ల, కాంగ్రెస్ ఏడు చోట్ల, ఎన్ సిపి ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి.. మిగిలిన స్థానాలకు ఈ పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
అలాగే, జార్ఖండ్‌లో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ )కి వ్యతిరేకంగా భారత కూటమిలో భాగమైన అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ పడుతుంది. కాగా, ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వివరాలు
మొత్తం స్థానాలు – 288
నోటిఫికేషన్ – అక్టోబర్ 22
నామినేషన్స్ స్వీకరణ – అక్టోబర్ 22
నామినేషన్స్ ఆఖరి తేది అక్టోబర్ 29
ఉపసంహరణ – నవంబర్ 4
పోలింగ్ – నవంబర్ 20
కౌంటింగ్ – నవంబర్ 23
జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు
రెండు దశలలో పోలింగ్
మొత్తం స్థానాలు 81
ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు
నోటిపికేషన్ – అక్టోబర్ 18
నామినేషఫన్ – అక్టోబర్ 18
నామినేషన్స్ కు ఆఖరి రోజు – అక్టోబర్ 25
ఉప సంహరణ – అక్టోబర్ 30
పోలింగ్ – నవంబర్ 13
కౌంటింగ్ – నవంబర్ 23
జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు
రెండు దశలలో పోలింగ్
మొత్తం స్థానాలు 81
రెండో ఫేజ్ ఎన్నికలు
నోటిపికేషన్ – అక్టోబర్ 22
నామినేషఫన్ – అక్టోబర్ 22
నామినేషన్స్ కు ఆఖరి రోజు – అక్టోబర్ 29
ఉప సంహరణ – నవంబర్ 1
పోలింగ్ – నవంబర్ 20
కౌంటింగ్ – నవంబర్ 23