ముంబయి – మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక నేడు ఒక కొలిక్కి వచ్చింది.. నేడు జరిగిన బిజెపి శాసనసభ పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. అలాగే రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బిజెపి కోర్ కమిటీ ప్రకటించింది.. ముంబయి అజాద్ మైదానంలో రేపు జరిగే కార్యక్రమంలో దేవంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎస్పీపి నేత అజిత్ పవార్, శివసేన అధినేత ఏకనాథ్ షిండే లు ఉప ముఖ్యమంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. ముఖ్యమంత్రి అభ్యర్ధి తేలిపోవడంతో ప్రమాణ స్వీకారానికి బిజెపి కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement