Monday, November 25, 2024

Maharastra – మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ – ఎన్ కౌంటర్ లో 12 మంది హతం

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆటోమేటిక్‌ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆరుగంటల పాటు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం.

మధ్యాహ్నం సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో సోదాలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి

ఘటనా స్థలంలో మూడు ఏకే47లు, కార్బైన్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ సహా ఏడు ఆటోమేటెడ్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగడ దళం ఇన్‌చార్జి డీవీసీఎం లక్ష్మణ్‌ ఆత్రం ఉన్నట్లు గుర్తించారు.

మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య వందోలియా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో సీ60కి చెందిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు జవాన్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. వారిద్దరిని నాగ్‌పూర్‌కు తరలించినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్‌పాల్‌ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement