Thursday, October 24, 2024

Maharashtra Elections | అంతరాష్ట్ర పోలీసు అధికారుల భేటీ

  • గడ్చిరోలిలో సమావేశం
  • మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో
  • మావోయిస్టులను కట్టడి చేసేందుకు


గడ్చిరోలి, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంత రాష్ట్ర పోలీసు అధికారులు సమావేశమయ్యారు. నవంబర్ 20న జరిగే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మహారాష్ట్ర నలువైపులా ఉన్న రాష్ట్రాల పోలీస్ అధికారుల సమావేశం గురువారం గడ్చిరోలిలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుండి రామగుండం పోలీస్ కమిషనర్, ఐజి శ్రీనివాస్, గడ్చిరోలి డిఐజి అంకిత్ పాండ్యా హాజరై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

చత్తీస్ ఘ‌డ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీస్ అధికారులతో మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, ఫేర్రి పాయింట్ల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రామగుండం కమిషనరేట్ పోలీసులు మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల రూపాయల విలువ గల 300 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.

రామగుండం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు 24 గంటల పాటు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నదితీర ప్రాంతాల్లో నిఘా పెంచాలని, మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నుండి ఆసిఫాబాద్, భూపాలపల్లి ఎస్పీ లతో పాటు మంచిర్యాల డీసీపీ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement