మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా పెగుతున్నాయి. ఇదిఇలా ఉంటే.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. మార్చి 11న మొదటి డోసును ఆయన… ఈ రోజు రెండో డోసు తీసుకున్నారు. ఈ రోజ ప్రధాని మోదీ కూడా రెండో డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ముంబైలో కొత్తగా 10,428 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా పుణెలో 11,023 కొత్త కేసులు నమోదు అయ్యయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,73,261కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 56,652కు చేరింది. కాగా, మహారాష్ర్టలో కరోనా టీకాల కొరత ఉందని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.