వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకుంటే నేను కూడా సీఎం అవుతానా అని అన్నదా దామ్రే అనే బాలిక సీఎం ఏక్ నాథ్ ని ప్రశ్నించింది. ఈ సంఘటన ముంబైలో ఉన్న నందన్వన్ బంగ్లాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అస్సాంలో వదరలు వచ్చినప్పుడు మీరు ఆ నీటిలో వెళ్లి ఆదుకున్నారా కదా అని ఆ అమ్మాయి ప్రశ్న వేసింది. దానికి సీఎం షిండే సమాధానం ఇస్తూ అవును కచ్చితంగా నువ్వు సీఎం కావొచ్చు అని, దీనికి సంబంధించిన తీర్మానం పాస్ చేస్తామని నవ్వుతూ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ఆ అమ్మాయి మాట్లాడుతూ.. దీపావళి పండుగ వేళ తనను గౌహతి తీసుకువెళ్లాలంటూ అడిగింది. తప్పుకుండా వెళ్దాం, గౌహతిలో కామాఖ్యా ఆలయానికి వెళ్లాలని ఉందా అని షిండే అన్నారు. అవును అని ఆ బాలిక సమాధానం ఇచ్చింది. అమ్మాయి చాలా స్మార్ట్‌గా ఉందని షిండే తనతో ఉన్నవారితో అన్నారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement