మహారాష్ట్ర కేబినెట్ ఇవ్వాల (బుధవారం) సాయంత్రం సీఎం ఉద్ధవ్ థాకరే ఆధ్వర్యంలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రి వర్గం. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను వరుసగా శంభాజీనగర్, ధరాశివ్‌గా మార్చడానికి మంత్రి వర్గం ఆమోదించింది. అలాగే నవీ ముంబై విమానాశ్రయం పేరును కూడా డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చనున్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మహారష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Breaking: ఔరంగాబాద్ పేరు మార్చేసిన శివసేన.. నవీ ముంబై ఎయిర్పోర్ట్ పేరు కూడా..
Advertisement
తాజా వార్తలు
Advertisement