Friday, November 22, 2024

పాక్ లో మహారాజా రంజిత్ విగ్రహం ధ్వంసం

పాకిస్తాన్‌లో మహారాజా రంజిత్‌ సింగ్‌కు ధ్వంసం చేశారు. లాహోర్‌ కోటలో ప్రతిష్ఠించిన మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూల్చివేశారు. దాంతో విగ్రహం ముక్కలు ముక్కలైంది. 19వ శతాబ్ద కాలం నాటి సిక్కు రాజు అయిన మహారాజా రంజింత్‌ సింగ్‌ 9 అడుగుల పొడవైన విగ్రహాన్ని కాంస్యంతో తయారు చేశారు.

లాహోర్‌ కోటలో మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు కూల్చివేశారు. అయితే, దిమ్మెపై గుర్రం మాత్రం ఉండిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ రాడికల్ గ్రూప్ సభ్యులు మంగళవారం లాహోర్‌లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ కోటలో ఉన్న మహారాజా విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది మూడోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement