మహానంది దేవస్థానంలో భక్తుల దగ్గర నిలువ దోపిడీ..
…ఆలయ అధికారుల పర్యవేక్షణ శూన్యం…
…ఒక్క టెంకాయ కొడితే 100 రూపాయలు ఇవ్వాల్సిందే!…
నంద్యాల బ్యూరో -…. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కార్తీక మాసం ప్రారంభం అయంది. భక్తులు హడావుడిగా ఉన్నారు. పుణ్యక్షేత్రాలలో నిత్యము పూజలు జరుగుతూ ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మొదటి సోమవారము అయినందున నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ ప్రాంతంలో పోలీసుల పర్యవేక్షణ తక్కువగాఉంది. దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే ఆసరాగా తీసుకొని భక్తుల దగ్గర నుండి నిలువ దోపిడి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు స్థానికులైన కొందరు కార్తీక మాసం మొదటి సోమవారం అవడంతో భక్తులు శివుని దర్శనార్థం పూజా సామాగ్రి తో పాటు టెంకాయ తీసుకొని వెళ్లడం ఆనవాయితీ.
లోపలికి వెళ్లిన అనంతరం, శివాలయం పక్కనే ఉన్న టెంకాయల టెండర్ల దారులు, టెంకాయ కొట్టి ఇచ్చిన అనంతరం దక్షిణ అడిగారు. అయితే భక్తులు తమ వంతుగా ఏమీ ఆలోచించకుండా వంద రూపాయలు ఇచ్చి, 10 రూపాయలు తీసుకొని చిల్లర ఇవ్వమని అడగ్గా, వారు ఏమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగారు, అయితే వంద రూపాయలు ఇచ్చినటువంటి భక్తులు ఇదేమి పరిస్థితి ఒక్క టెంకాయ కొడితే వంద రూపాయలా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.
అది కూడా స్థానికులం మీరుఅడిగినట్టుగానే మేము దక్షిణ అయితే ఇచ్చాం, కానీ మా దగ్గరే ఇంత నిలువు దోపిడీ చేస్తున్నారంటే అధిక సంఖ్యలో కొత్త వాళ్లు ఎంతోమంది వస్తుంటారు. ఇలా ఎంత నిలువు దోపిడీ చేస్తున్నారో?.. అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. అనంతరం ఆలయ ఏఈఓ మధుకు ఫిర్యాదు చేయడంతో అక్కడ టెంకాయలు కొట్టే వారిని బయటికి పంపించారు.. చిన్న చిన్న విషయాలను పట్టించుకునే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు లేకపోవడం విశేషం. లడ్డు కౌంటర్ దగ్గర కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయంపై వివరణ కోసం పలు సార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడం విశేషం.