ఏ ఒక్కరికి ఏం సమస్య వచ్చినా పోలీసులు ముందుటారు. కానీ ఈ పోలీస్ మాత్రం అందుకు విభిన్నంగా ఉంటాడు. వివరాల్లోకి వెళ్తే … ఈయన పేరు శ్రీనివాస చారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టూటౌన్ సి.ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన గారికి మహిళలే టార్గెట్. మహిళ్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వెన్నతో పెట్టిన విద్య. అయితే గత కొంత కాలంగా కేసు పనిమీద వచ్చిన మహిళని లోబరుచుకుని అక్రమ సంబంధం పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాడు. కానీ ఆమెకు న్యాయం మాత్రం జరగలేదు. దీనితో ఉన్నతాధికారులకు భాదిత మహిళ ఫిర్యాదు చేసింది.
దీనితో సి.ఐ. పై దృష్టి సారించిన పైస్దాయి అదికారులు సస్పెండ్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరెవరు ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో.. ఎవరిపై కేసులు నమెూదు చేస్తున్నారో, ఏ సెక్షన్లు కింద నమెూదు అవుతున్నాయెూ… సదరు వ్యక్తులకు తెలవకపోయిన, సి.ఐ. తో సంబంధాలు వున్న ఒంటరిమహిళలకు మాత్రం సమాచారం వుంటుందట.