శ్రీశైలం : మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలంలో శనివారం ఉదయం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:46 గంటలకు ఆలయ ఈవో లవన్న నేతృత్వంలో అర్చకులు, వేద పండితులు బేరి పూజ చేసి సకల దేవతలను ఆహ్వానిస్తూ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. నేటి సాయంత్రం 7.00 గంటలకు అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరుపున శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాల సమర్పించనున్నారు. ఉత్సవాలలో ప్రతిరోజూ స్వామి అమ్మవార్లకు ఆయా వాహన సేవవలు అధికారులు నిర్వహించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement