Thursday, November 7, 2024

Maha Sakthi Scheme – ఉచిత గ్యాస్ సిలిండర్ ల పథకం – దీపావళి నుంచి ప్రారంభం

విజయవాడ – దీపావళి పండగ సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుందన్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉన్నారు. వీరికి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రూ. 3640 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు

.దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ వెలుగులు తీసుకొస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మహిళలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారన్నారు. అందుకే వారిని ఆశీర్వదించడానికి.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మనోహర్ చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement