Wednesday, November 20, 2024

మ‌హా పాద‌యాత్ర‌కి శ్రీకారం..ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోరిన టిడిపి

నేడు న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం మ‌హా పాద‌యాత్ర ప్రారంభం కానుంది. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని రైతులు ఈ పాద‌యాత్ర‌ని చేప‌ట్టారు. కాగా ఈ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇవ్వడంతో పాదయాత్రం నేడు ప్రారంభం కానుంది. అమరావతిని ఏపీ రాజధానిగా కొనాసగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. మహాపాదయాత్రకు ఏపీలోని ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించింది. టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి మద్దతు లభించింది.

మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. సర్వమత ప్రార్థనల అనంతరం తూళ్లురు దీక్షా శిబిరం నుంచి పాదయాత్ర మొదలు కానుంది. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర సాగనుంది. దాదాపు 685 రోజుల నుంచి అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు అందోళన చెస్తున్నారు. పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాలని టీడీపీ కోరింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా పాదయాత్రకు చేయనున్నారు. తిరుపతిలో డిసెంబర్ 17 నాటికి చేరుకుని పాదయాత్రను ముగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement