ఉత్తర్‌ప్రదేశ్ : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి అతిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. ఘటనపై సీఎం ఆదిత్యనాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాగా, మహా కుంభమేళాలో క్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి. సమీపంలోని 10 టెంట్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.
విషయం తెలిసిన వెంటనే సీఎం యోగి అతిత్యనాథ్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదంపై అధికారులు, ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆదిత్యనాథ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.