Monday, January 13, 2025

Maha Kumbamela – తొలిరోజే పోటెత్తిన మ‌హాకుంభ మేళ‌ – ఏకంగా 90 ల‌క్ష‌ల మంది రాజ‌స్నానం

ప్ర‌యోగ్ రాజ్ – ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా వేడుక ఘనంగా ప్రారంభమైంది. త్రివేణీ సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానమాచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. తొలి రోజున తొలిరోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజ స్నానం చేసేందుకు భ‌క్త‌లు పోటెత్తారు.. ప్ర‌తి స్నాన‌ఘ‌ట్టం భక్త జ‌నంతో కిట‌కిట‌లాడాయి ..ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహా కుంభ 45 రోజుల పాటు సాగనుంది.. పిబ్రవరి 25 వ తేదీన మహా శివరాత్రి రోజున రాజ స్నానంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచయి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. . తొలి రోజున ఏకంగా నాలుగు ప్ర‌ధాన స్నాన‌ఘ‌ట్టాల‌లో 90 ల‌క్ష‌ల మంది రాజ‌స్నానాలు ఆచ‌రించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన నాగ సాధువులు
ప్రయాగరాజ్‌లో మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానం చేయడానికి భక్తుల‌తో పాటు లక్షల మంది నాగ సాధువులు కూడా త‌ర‌లివ‌చ్చారు..ప్ర‌యోగ రాజ్ స్నాన ఘ‌ట్టంలో వారు రాజ‌స్నానం ఆచరించారు. గంగాన‌ది ప‌రివాహక ప్రాంతంలో నాగ సాధువులు మ‌కాం వేశారు.. మ‌గ సాధువుల‌తో పాటు మ‌హిళా నాగ సాధువులు సైతం ఈ సారి భారీగా త‌రలి రావ‌డం విశేషం .

ఏక వ‌స్త్రంతో మ‌హిళా నాగ సాధువులు

- Advertisement -

ఇక నాగ సాధువుల‌లో ఎక్కువ మంది ఏక వ‌స్త్రంతో ఉంటారు.. కొంతమంది మాత్రం బట్టలు లేకుండా ఉంటారు. వీరిని దిగంబరులు అని పిలుస్తారు. మ‌హిళా నాగ సాధువులు కుట్టని వస్త్రాన్ని ధరిస్తారు. దీనిని గంటి అంటారు. నాగ సాధువు కావడానికి ముందు మహిళ 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. మహిళలు ఇలా చేసిన తర్వాత మహిళా గురువు ఆ స్త్రీని నాగ సాధువులుగా మారడానికి అనుమతిస్తారు. మహిళా నాగ సాధువులు తమ నుదుటిపై తిలకం తప్పని సరిగా పెట్టుకోవాలి.

10 ఏక‌రాల‌లో భ‌క్తుల‌కు స‌దుపాయాలు
ప్రయాగ్ రాజ్ సహా కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ మహా కుంభలో రికార్డ్ స్థాయిలో సుమారు 40 కోట్ల మంది యాత్రికులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎటువంటి సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు భక్తులు కుంభ మేళా పరిసర ప్రాంతాల్లో ఉండగలిగేలా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. నదిలో భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేక తేలియాడే పోలీసుస్టేషన్‌ మాత్రమే కాదు.. అకస్మాత్తుగా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే భక్తుల రక్షణ కోసం నీటిలో తెలియాడే అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. నదిలో చిన్న చిన్న పడవలపై ప్రయాణిస్తూ భద్రతా సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్‌ చేస్తున్నారు.

50వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది..

భక్తుల భద్రత కోసం ఏకంగా 50 వేల‌మందిని మోహ‌రించారు.. వారిలో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఉన్నాయి. 55 ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్ ల‌ను ఏర్పాటు చేశారు..నిరంత‌రం సిసి కెమెరాల‌తో భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేదుకు.. భద్రత కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. సంగం మేళా ప్రాంతానికి జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ప్రవేసించే విధంగా ఏర్పాటు చేశారు.. అదే విధంగా సంగ మేళా ప్రాంతం నుంచి బయటకు రావడానికి త్రివేణి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే కుంభ మేళా రాజ స్నానం సమయంలో సందర్శకులకు అక్షయవత్ దర్శనం మూసివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement