Friday, November 22, 2024

16 నుంచి మహా జాతర.. మేడారం వచ్చే భక్తులు కొవిడ్​ రూల్స్​ పాటించాలి..

మేడారం మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. రెండేళ్లకోసారి జాతర జరుగుతుంటుంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తుంటారు. ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది. 19న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ జాత‌ర‌కు కోటిన్నర మందికి పైగా భక్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విడత కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో జాతర జరగనుండడం సర్కారుకు ప్రతిష్ఠాత్మకం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. వ‌చ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు సిధ్దం చేసిన‌ట్లు పేర్కొన్నారు. జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు.

భక్తులందరూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ లు ధరించి రావాలని ఆమె సూచించారు. ప్రభుత్వం తరఫున మాస్క్ లను భక్తులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇక అర గంటలో దర్శనం పూర్తయ్యే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామని చెప్పారు. దేశ, విదేశీ భక్తులు ఎక్కువ మంది రావచ్చని మంత్రి రాథోడ్ పేర్కొన్నారు. 8 వేలకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ రద్దీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement