Saturday, November 23, 2024

మ‌హా సంక్షోభం: షిండే చెంత‌కు మ‌రో న‌లుగురు.. 44కు చేరిన అస‌మ్మ‌తి వ‌ర్గం

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం యావ‌త్ దేశం దృష్టిని ఆలోచ‌న‌లోప‌డేసింది. నిన్న రాత్రి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే మరింత బలం సమకూర్చుకుంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షిండే చెంతకు చేరుతున్నారు. బుధవారం ఉదయం వరకు స్వంతంత్రులతో కలిపి 40 మంది ఎమ్మెల్యేలు షిండే తో క‌లిసి ఉన్నారు.

కాగా, ఇవ్వాల మరో నలుగురు ఎమ్మెల్యేలు త‌న శిబిరంలో చేరారు. దీంతో షిండే మద్దతుదారుల సంఖ్య 44కు చేరింది. కాగా, శివసేనలో ప్రారంభమైన ముసలంతో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం పతనం దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఎమ్మెల్యేలు కోరితో తాను సీఎం పదవికి, పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement