మధ్యప్రదేశ్‌లో ఆడుకుంటూ బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మహిని 9గంటల పాటు శ్రమించి బయటకు తీశారు.వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఇవాళ ఉదయం పాపను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప మరణించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి ప్రాణాలతో దక్కడంతో ఎంతో ఆనందించామని.. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని రెస్క్యూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.