Tuesday, November 26, 2024

Polling – మధ్యప్రదేశ్‌ , ఛత్తీస్‌గఢ్‌లలో పొలింగ్ ప్రారంభం….

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 శాసనసభ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం పోలింగు ప్రారంభమైంది. . నేటి పోలింగ్ లో 230 స్థానాల్లో 2,533 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 5కోట్ల 6లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఆయా పార్టీల కీలక నేతలను రంగంలోకి దింపి ప్రచారంతో హోరెత్తించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల ఏడున 20 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగు జరిగింది. 22 జిల్లాల పరిధిలో ఉన్న మిగతా 70 స్థానాలకు నేటి ఉదయం ఓటింగు ప్రారంభమైంది.. పశ్చిమ రాయ్‌పుర్‌ స్థానంలో అత్యధికంగా 26 మంది పోటీలో ఉండగా.. డౌండీలోహారా స్థానంలో అత్యల్పంగా నలుగురు బరిలో ఉన్నారు. రెండోవిడత పోలింగు జరుగుతున్న 70 స్థానాల్లో క్రితం సారి కాంగ్రెస్‌ 50 చోట్ల గెలుపొందగా, భాజపా 13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ నాలుగు, బీఎస్‌పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement