వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువుకట్టపై ఉన్న పెద్ద వేప చెట్టు వేళ్లతో సహా నేలకూలింది. అది కాస్త చెరువులో పడింది. కట్టపై ఉన్న భారీ వృక్షం వర్షం కారణంగా కూలి పడడంతో కట్ట తెగే ప్రమాదం ఉందని కొంతమంది అంటున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ జుర్రు రాజు, మాదన్న పేట చెరువు మాజీ చైర్మన్ చిలువేరు కుమారస్వామి అక్కడికి చేరుకుని పరిశీలించారు. కట్ట తెగకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. చెరువు కట్ట తెగి ప్రమాదం వస్తుందన్న మాటలు నమ్మొద్దని, మాదన్నపేటకు ఎటువంటి ప్రమాదం లేదని, రక్షణ చర్యల కోసం ఇసుక బస్తాలు సమకురుస్తామని వారు తెలిపారు.